: విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు: ప్రధాని
నేడు విడుదలైన 2014 సివిల్స్ ఫలితాల్లో విజయం సాధించిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్లర్లో శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవకు ప్రయాణం ప్రారంభిస్తున్న వారందరికీ అభినందనలని అన్నారు. పరీక్షలో విజయం సాధించని వారి జీవితంలో ఇది ఓ భాగమని, ఈ ఫలితం భవిష్యత్ ప్రణాళికలను అడ్డుకోదని ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.