: ఏపీలో నూతన ఈ-మెయిల్, ఆధార్ విధానానికి మంత్రివర్గం ఆమోదం


ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి అధికారిక ఈ-మెయిల్స్ నే ఉపయోగించనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో కొత్త ఈ-మెయిల్ విధానానికి ఏపీ మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే మెయిల్స్ నే ఉద్యోగులు వినియోగించాలని నిర్ణయించింది. దాంతో జూనియర్ అసిస్టెంట్ నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు ప్రభుత్వ మెయిల్స్ నే ఉపయోగించవలసి ఉంటుంది. తొలిదశలో 40వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వం మెయిల్ సదుపాయం కల్పిస్తుంది. వచ్చే ఏడాదికల్లా 2.5 లక్షల ఉద్యోగులకు ప్రభుత్వ ఈ-మెయిల్ సదుపాయం లభిస్తుంది. అంతేగాక ఆధార్ విధానానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆధార్ లేనివారికి ఏఏ కార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న విషయంపై చర్చించింది. ఈ క్రమంలో ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఆధార్ ను ఒకే విధంగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఎలా వినియోగించుకోవాలన్న దానిపై త్వరలోనే నిబంధనలు రూపొందిస్తుంది. అయితే ఆధార్ లేనివారికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు చూపాలన్న అంశంపైనా మంత్రివర్గం చర్చించినట్టు సమాచారం. ఇక గుంటూరు కేంద్రంగా ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కేబినెట్ భేటీ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News