: భత్కల్ వద్ద ఫోన్ లేదు... ల్యాండ్ లైన్ నుంచే 27 సార్లు మాట్లాడాడు: జైళ్ల శాఖ డీఐజీ


ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ వద్ద ఫోన్ లేదని జైళ్ల శాఖ డీఐజీ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. అందరిలాగానే జైళ్లోని ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి తన తల్లి, భార్యతో మాట్లాడాడని తెలిపారు. మొత్తం 27 సార్లు ఫోన్లో మాట్లాడాడని... ఇందులో 25 సార్లు అరబిక్, ఉర్దూలో మాట్లాడాడని చెప్పారు. ఈ ఆడియో ఫుటేజ్ ను ఎన్ఐఏకి అందజేశామని తెలిపారు. తొలుత భత్కల్ కు ఫోన్ ఇవ్వడానికి తాము నిరాకరించామని... అయితే, కోర్టు ఆదేశాల మేరకు వారంలో రెండు సార్లు (ఒక్కోసారి 5 నిమిషాలు) మాట్లాడుకోవడానికి అనుమతించామని వెల్లడించారు. పారిపోయే ప్రయత్నాల్లో భత్కల్ ఉన్నట్టు ఎన్ఐఏ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని... అయినప్పటికీ, తాజాగా వెల్లడైన అంశాల నేపథ్యంలో, చర్లపల్లి జైలుకు అదనపు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News