: రసాభాసగా మారిన జగన్ ముఖాముఖి!
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు రైతులతో వైకాపా అధినేత జగన్ నిర్వహించిన ముఖాముఖి రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో, తమ పొగాకు బేళ్లను తొక్కుతున్నారంటూ వైకాపా కార్యకర్తలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, రైతులకు, వైకాపా కార్యకర్తలకు మధ్య స్వల్ప స్థాయిలో తోపులాట జరిగింది. దీంతో, ముఖాముఖి కాస్తా రసాభాసగా మారింది.