: చత్తీస్ గఢ్ చీఫ్ సెక్రెటరీపై తీవ్ర ఆరోపణలు!


చత్తీస్ గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివేక్ దండాపై అక్రమ సంబంధ అభియోగాలు వెల్లువెత్తాయి. తన భార్యతో చీఫ్ సెక్రెటరీ అక్రమ సంబంధం పెట్టుకున్నారని... తన ప్రమోషన్ ను కూడా అడ్డుకుంటున్నారని అటవీశాఖలో ఉన్నతోద్యోగిగా ఉన్న అనూప్ బల్లా ఆరోపించారు. సీఎస్ తో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని తెలిశాక... ఆమెకు విడాకులు ఇవ్వడానికి యత్నించానని, అయితే డైవోర్స్ రాకుండా ఆమె అడ్డుకున్నారని తెలిపారు. అప్పట్నుంచి ఆమె తనపై కక్షతో ఉందని చెప్పారు. ఈ విషయం సీఎం రమణ్ సింగ్ తోపాటు, అటవీశాఖ మంత్రి మహేష్ కు కూడా తెలుసని అన్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు చత్తీస్ గఢ్ లో సంచలనం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News