: ఆ సినిమా పేరు మార్చాల్సిందేనని వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్ ఆందోళన


రంజాన్ పర్వదినం సందర్భంగా వెండితెరను తాకనున్న సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం 'భజరంగీ భాయిజాన్' పేరు మార్చాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌ దళ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ పేరు హిందువులను కించపరిచే విధంగా ఉందని వారు ఆరోపించారు. తక్షణం పేరు మార్చకుంటే తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని, థియేటర్లలో చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. సల్మాన్ తో పాటు కరీనా కపూర్ నటించిన ఈ చిత్రానికి కబీర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 'భజరంగీ భాయిజాన్' చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News