: పార్లమెంట్ సభ్యుల వేతనాల పెంపు సిఫారసుకు కేంద్రం తిరస్కరణ
పార్లమెంటు సభ్యుల వేతనాలు, భత్యాలు, మాజీ ఎంపీల పింఛన్లకు సంబంధించి పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించేందుకు ప్రభుత్వం విముఖత తెలిపింది. బీజేపీ ఎంపీ యోగా ఆదిత్యానాథ్ నేతృత్వంలోని ఈ కమిటీ చేసిన సిఫారసులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొదట పరిశీలించింది. ఆ వెంటనే చర్యల నివేదికకు తన అభిప్రాయాలను జతచేస్తూ తిరిగి ఈ కమిటీకే జూన్ 24న పంపించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కమిటీ చేసిన సిఫారసులను పరిశీలించలేమని మంత్రిత్వశాఖ పేర్కొన్నట్టుగా ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఎంపీల దినసరి భత్యం రూ.2వేల నుంచి రూ.5వేలకు పెంచడం, విమాన ప్రయాణాల సంఖ్యను 34 నుంచి 48కు పెంచాలని, మాజీ ఎంపీలకూ ఉచిత విమాన సౌకర్యం కల్పించాలని... ఇలా కమిటీ చేసిన పలు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి.