: అవసరమైతే రిక్షా తొక్కుతా, లేదంటే బెండకాయలు అమ్ముకుంటా...!: టీ-ఏఏజీ రామచంద్రరావు


సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై తాను చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయన్న సంగతి తనకు తెలుసునని తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. తన పదవి పోయినా, జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడనని ఆయన అన్నారు. జీవనోపాధి కోసం అవసరమైతే రిక్షా తొక్కుతానని, కాకుంటే బెండకాయలు అమ్ముకుంటానని ఆయన తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో నిష్పాక్షిక నిర్ణయాలు వెలువడడం లేదని ఆరోపించారు. సమాజంలో న్యాయం లేదని, ఒక న్యాయవాదిగా తన మనసు వికలమై ఇలా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు న్యాయమూర్తులు స్నేహితులని, వారంతా ఆయనకు సాయపడుతున్నారని రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News