: సరిహద్దుల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం, ఓ సైనికుడి వీరమరణం
భారత్ లోకి చొరబడాలన్న ఉద్దేశంతో సరిహద్దులు దాటుతున్న ఉగ్రవాదులపై భారత సైన్యం దాడి జరిపింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భారీ స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ముష్కరులు హతం కాగా, వారిని అడ్డుకునే క్రమంలో ఓ జవాను వీరమరణం పొందాడు. భారీగా ఆయుధాలతో వచ్చిన ఉగ్రవాదుల బృందం ఇండియాలోకి చొరబడటాన్ని తాము గమనించామని, కాల్పుల్లో ఐదుగురు మరణించగా, మిగిలిన వారు వెనక్కు పారిపోయారని సైన్యాధికారి ఒకరు తెలిపారు.