: గ్రామీణ భారతావనిలో అత్యధిక వేతనం రూ. 5 వేలు మాత్రమే!
గ్రామీణ భారతదేశంలో నాలుగింట మూడొంతుల మందికి నెలకు రూ. 5 వేలకన్నా తక్కువ వేతనం లభిస్తోందని సామాజిక ఆర్థిక కుల గణాంకాల (ఎస్ఈసీసీ-సెక్) నివేదిక వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం 13.34 కోట్లు లేదా 74.49 శాతం ఇండియన్ కుటుంబాలకు నెలసరి వేతనం చాలా తక్కువగా ఉందని, వీరి జీవనానికి అది ఎంతమాత్రమూ సరిపోదని వెల్లడించింది. కేవలం 1.48 కోట్ల కుటుంబాలు (8.29 శాతం) మాత్రమే రూ. 10 వేలకు మించిన వేతనాన్ని పొందుతున్నాయని పేర్కొంది. దేశంలోని 640 జిల్లాల్లో 6.4 లక్షల ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తూ, సమాచారాన్ని సేకరించామని సెక్ వెల్లడించింది. భారతీయుల్లో 1.12 శాతం మంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా ఉండగా, 3.58 శాతం ప్రైవేటు రంగంలో ఉపాధిని పొందుతున్నారని తెలిపింది.