: భూమాకు 14 రోజుల రిమాండ్... ఆళ్లగడ్డ జైలుకు తరలింపు


వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని కర్నూలు జిల్లా నంద్యాల త్రీ టౌన్ పోలీసు స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించి, ఆపై న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. నిన్న పోలీసులను దూషించిన కేసులో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించడంతో భూమాను ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలిస్తున్నారు. కాగా, బాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కావాలనే కేసులు పెడుతోందని ఈ సందర్భంగా భూమా ఆరోపించారు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమేనని, ఇటువంటి కేసులకు భయపడేది లేదని అన్నారు.

  • Loading...

More Telugu News