: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కేసీఆర్ భయపడ్డారు: లోకేష్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడ్డారని టీడీపీ కార్యకర్తల నిధి సమన్వయ కర్త నారా లోకేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేల కొనుగోలును వదిలేసి కాంగ్రెస్ వైపు మళ్లారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని లోకేష్ ట్వీట్ చేశారు. రాజకీయ వ్యాఖ్యలు ట్వీట్ చేస్తూ మనసులో మాట బయటపెట్టే లోకేష్ కొంత గ్యాప్ తరువాత ట్వీట్ చేశారు.