: రియల్ ఎస్టేట్ దెబ్బతింటుందన్నారు...ఇప్పుడు రియల్ బూం పుంజుకుంది: కేసీఆర్


రాష్ట్రం విడిపోతే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని పుకార్లు రేపారని, అయితే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బూం పుంజుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నారపల్లిలో హరితహారం కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ, ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించారని, అదిప్పుడు కనుమరుగైందని అన్నారు. హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు అవతల భూమిని ఐదు జోన్లుగా విభజించామని అన్నారు. పరిశ్రమలన్నీ హైదరాబాదుకు క్యూ కడుతున్నాయని ఆయన చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం వారైనా హైదరాబాదు గురించే మాట్లాడుకుంటున్నారని ఆయన తెలిపారు. మీరు కూడా మాలాగే పాలసీలు రూపొందించుకోవాలని తాను చెబుతున్నానని కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ భూమిని ఇవ్వాలని పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారని కేసీఆర్ చెప్పారు.

  • Loading...

More Telugu News