: ఒరిజనల్ టీఆర్ఎస్ నేతలు తిరగబడాలి: శ్రవణ్


టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ సేవలందిస్తున్న ఒరిజనల్ నేతలు తిరగబడాలని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తిరగబడితేనే ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు పదవులు దక్కకుండా ఉంటాయని అన్నారు. డీఎస్ ఒక కోవర్టు అని, అలాంటి వ్యక్తి పార్టీని వీడడం సంతోషంగా ఉందని శ్రవణ్ తెలిపారు. బీసీల కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నానని డీఎస్ చెప్పడం ఆత్మవంచనేనని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ లో దగా పడింది బీసీలేనని ఆయన స్పష్టం చేశారు. కాగా, శ్రవణ్ గతంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.

  • Loading...

More Telugu News