: భజ్జీకి శుభాకాంక్షల వెల్లువ
టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన హర్భజన్ సింగ్ ను అభినందిస్తూ పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, భజ్జీ బాల్య స్నేహితుడు యువరాజ్ సింగ్, వెటరన్ క్రికెటర్ అనిల్ కుంబ్లేలు శుభాకాంక్షలు తెలిపి, జింబాబ్వే పర్యటనలో ఉత్తమ ప్రదర్శన చేయాలని సూచించారు. అద్భుతమైన భవిష్యత్ ముందుందని సినీ నటుడు అభిషేక్ బచ్చన్, హిందీ బుల్లి తెర నటుడు కపిల్ శర్మ హర్భజన్ కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని భజ్జీ ట్విట్లర్లో సమాధానమిచ్చాడు.