: రేవంత్ నాలుక కోస్తా: టీఆర్ఎస్ ఎంపీ సుమన్
తెలంగాణ పాలనపై అసత్య ప్రచారం చేస్తే టీడీపీ నేత రేవంత్ రెడ్డి నాలుక కోస్తామని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అవినీతిని ఎండగట్టడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. చంద్రబాబు పెంపుడు కుక్కలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని సుమన్ మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లాయని ఆయన పేర్కొన్నారు.