: స్లెడ్జింగ్ లేకపోతే మజా ఏముంటుంది?: డేవిడ్ వార్నర్
క్రికెట్ లో స్లెడ్జింగ్ లేకపోతే మజా ఏముంటుందని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రశ్నిస్తున్నాడు. స్లెడ్జింగ్ ను నియంత్రించాలన్న ఐసీసీ నిర్ణయంపై వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్లెడ్జింగ్ ను ఆటలో భాగంగా చూడాలని సూచించాడు. స్లెడ్జింగ్ ను నియంత్రించడం సబబు కాదని వార్నర్ చెప్పాడు. స్లెడ్జింగ్ ను పూర్తి స్థాయిలో నిషేధిస్తే ఆటలో సరదా పోతుందని హెచ్చరించాడు. స్లెడ్జింగ్ కారణంగా గత 18 నెలల్లో రెండు సార్లు ఐసీసీ హెచ్చరికలకు గురయ్యానని వార్నర్ చెప్పాడు. క్రికెట్ లో వికెట్లు పడిన సందర్భంగా ఫీల్డింగ్ జట్టు సంబరాలు చేసుకుంటుందని, అలాంటప్పుడు స్లెడ్జింగ్ సర్వసాధారణమని వార్నర్ చెప్పాడు. కాగా, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు స్లెడ్జింగ్ చేయడం సర్వ సాధారణం. కొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు చేసే వ్యాఖ్యలు ఆటలో ఉద్రేకాలకు దారితీస్తున్నాయని, పరస్పర దూషణలకు దిగుతున్నారని భావించిన ఐసీసీ స్లెడ్జింగ్ ను నియంత్రించాలని నిర్ణయించింది.