: ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పూర్తయిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ప్రకాశం, కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ప్రకాశం ఎన్నికల్లో 78 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 992 ఓట్లు ఉంటే 755 ఓట్లు పోలయ్యాయి. కర్నూలు జిల్లాలో భారీగా 99.67 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడ అత్యధికంగా 1,087 ఓట్లకుగానూ 1,080 ఓట్లు పోలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ నెల 7న ఓట్ల లెక్కింపు జరగనుంది.