: మొసలిని వివాహమాడిన మేయర్... అక్కడదే సంప్రదాయమట!


మూఢనమ్మకాలని తెలిసినా కూడా ఒక్కోసారి వాటిని ఆచరించడం మానవ బలహీనత అనే చెప్పచ్చు. అలాంటి మూఢ నమ్మకంతోనే మెక్సికోలోని శాన్ పెడ్రో హుమాలుల నగర మేయర్ వివాహాన్ని ఆయన భార్య దగ్గరుండి మరీ ఘనంగా నిర్వహించింది. హుమాలుల నగరంలో ఓ మూఢనమ్మకం బలంగా ఉంది. ఆ ఊరిపెద్ద మొసలిని వివాహం చేసుకుంటే మత్స్య సంపద పెరుగుతుందని, ఆ నగరం సకల సంపదలతో అలరారుతుందని నమ్మకం. దీంతో శాన్ పెడ్రో నగర మేయర్ జోయెల్ మేజన్ ఓ మొసలిని వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందు మొసలికి మరియా ఇసబెల్ అని పేరు పెట్టారు. అనంతరం మొసలి వేలికి ఉంగరం తొడిగి జోయెల్ మేజన్ వివాహ తంతు పూర్తిచేశారు. ఈ నగరానికి మేయర్ గా ఎవరు ఎన్నికైనా మొసలిని వివాహమాడడం సంప్రదాయం. అలా వివాహమాడిన మొసళ్లను నగరంలోని ఓ కొలనులో ఉంచి పెంచుతారు.

  • Loading...

More Telugu News