: ఏపీలో గోదావరి పుష్కరాల ముహూర్తం ఇదే!


ఆంధ్రప్రదేశ్ లో గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. శాలివాహన శక మన్మథ నామ సంవత్సరం అధిక ఆషాఢ బహుళ త్రయోదశి నుంచి పుష్కరాలు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 14న ఉదయం 6:20 గంటలకు పుష్కర ముహూర్తం మొదలవుతుందని వివరించింది. గురుడు సింహరాశిలో ప్రవేశించిన సందర్భంగా గోదావరి నది పుష్కరాలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. 25వ తేదీ వరకూ పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలను ఘనంగా నిర్వహించాలన్న లక్ష్యంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ఏర్పాట్లను శరవేగంగా పూర్తిచేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

  • Loading...

More Telugu News