: బదిలీ నిరాకరించినందుకు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పై సస్పెన్షన్ వేటు


దేశవ్యాప్తంగా ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పాప్యులర్ అయిన దయా నాయక్ పై పైస్థాయి అధికారులు వేటు వేశారు. నాగ్ పూర్ లో ఆయనకు కొత్తగా ఇచ్చిన పోస్టింగ్ ను కుటుంబ భద్రత కారణంగా తిరస్కరించడంతో ఆయనను తక్షణమే సస్పెండ్ చేశారు. "గతేడాది ఆయనను నాగ్ పూర్ కు బదిలీ చేశారు. తనకు ప్రాణహాని ఉందని మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి కూడా తెలియజేశారు. తాను ఒంటిరిగా బయటకు వెళ్లలేనని, హత్య చేస్తారని నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు" అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే, ఇవేమీ పట్టించుకోకుండా, కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా ఆయనను సస్పెండ్ చేశారు. కాగా, వివిధ నేరాలతో సంబంధం వున్న సుమారు 80 మందిని దయా నాయక్ వివిధ ఎన్ కౌంటర్లలో మట్టుబెట్టారు.

  • Loading...

More Telugu News