: ఈ రూ.5 కోట్ల బస్సు లగ్జరీ బస్సు కాదు... కనీసం బెడ్ కూడా ఉండదంటున్న కేసీఆర్ పేషీ


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోసం ప్రభుత్వం అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ.5 కోట్ల విలువైన ఈ మెర్సిడెస్ బెంజ్ బస్సు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరి నుంచి ముప్పు ఉందని ఇంత ఖరీదైన వాహనం కొనుగోలు చేశారని వారు మండిపడుతున్నారు. కాగా, ఈ బస్సు చండీగఢ్ నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఈ ఖరీదైన బస్సును రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పర్యవేక్షించనుంది. దీని గురించి సీఏం పేషీ ప్రతినిధి మాట్లాడుతూ... ఇది లగ్జరీ బస్సు కాదని, కనీసం దీంట్లో సీఎం కేసీఆర్ కోసం బెడ్ కూడా ఉండదని తెలిపారు. పర్యటనల సందర్భంగా ముఖ్యమంత్రితో సమావేశమయ్యేందుకు ఇందులో సీఎంవో సిబ్బంది కోసం 12 సీట్లు ఉంటాయి. ఇక, ఇందులో బెడ్ వద్దని సీఎం కేసీఆరే చెప్పినట్టు తెలిసింది. రోడ్ షోల సమయంలో బస్సు పైభాగానికి చేరుకునేందుకు సులువుగా ఎక్కగలిగే మెట్లు పొందుపరిచారు.

  • Loading...

More Telugu News