: రేవంత్ బెయిల్ ‘రద్దు’పై సుప్రీం విచారణ మరింత ఆలస్యం... పెరుగుతున్న ఉత్కంఠ


ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని తెలంగాణ ఏసీబీ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ పిటీషన్ ను నేటి ఉదయమే విచారిస్తుందని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. మధ్యాహ్నం ఈ పిటీషన్ విచారణకు వస్తుందుకున్నా, ఇంకా ఈ పిటీషన్ విచారణకు నోచుకోలేదు. తాజాగా కోర్టు సాధారణ కార్యకలాపాలు ముగిసిన తర్వాతే సదరు పిటీషన్ విచారణకు వస్తుందని కోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే, తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పిటీషన్ పై తెలుగు రాష్ట్రాల్లో అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది. తెలంగాణ ఏసీబీ తరపున కపిల్ సిబల్ లాంటి హేమాహేమీలు వాదిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి మంజూరైన బెయిల్ రద్దు కావడం ఖాయమేనని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే 'హైకోర్టు పరిధిలోని అంశంపై మేమెందుకు విచారణ చేపడతాం, అక్కడికే వెళ్లండి' అంటూ తెలంగాణ ఏసీబీకి సుప్రీం ధర్మాసనం మొట్టికాయలు వేయడం తప్పదని టీడీపీ వర్గాలు వాదిస్తున్నాయి.

  • Loading...

More Telugu News