: మహిళా న్యాయమూర్తిని లైంగికంగా వేధించి సస్పెండయిన హిమాచల్ ప్రదేశ్ జడ్జి
బాధ్యతాయుతమైన న్యాయమూర్తి పదవిలో ఉన్న ఓ వ్యక్తి, సహచర మహిళా న్యాయమూర్తిని లైంగికంగా వేధించాడు. ఆమె ఫిర్యాదుతో అతనిపై సస్పెండ్ వేటు పడింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, ట్రయల్ కోర్టులో న్యాయమూర్తులుగా ఉన్న వీరు మాదకద్రవ్యాలపై మనాలీలో జరిగిన ఓ సదస్సులో పాల్గొనే నిమిత్తం జూన్ 8న కలసి బయలుదేరి వెళ్లారు. అక్కడ తనను ఓ రిసార్టుకు రమ్మని ఆయన బలవంతం చేశాడని, అక్కడికి వెళ్లిన తనను వేధించాడని బాధిత మహిళా న్యాయమూర్తి, రాష్ట చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు న్యాయమూర్తిని సస్పెండ్ చేసిన సీజే రెండు నెలల్లోగా పూర్తి విచారణ జరిపి నివేదిక తనకివ్వాలని పోలీసులను ఆదేశించారు.