: ఎవరీ డస్టిన్ బ్రౌన్?


డస్టిన్ బ్రౌన్... ప్రపంచ టెన్నిస్ చరిత్రలో రాత్రికి రాత్రే హీరో అయిన ఆటగాడు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను మట్టి కరిపించి వింబుల్డన్ పోటీలో మూడవ రౌండ్లో ప్రవేశించిన జర్మనీ ప్లేయర్. ప్రపంచ టెన్నిస్ లో అతని ర్యాంకు 102. అయితేనేం, ఈ 6 అడుగులా 5 అంగుళాల పొడగరి ప్రపంచంలోని దాదాపు అన్ని పత్రికల్లోని వార్తల్లో నిలిచాడు. ఒక్కసారి అతని నేపథ్యాన్ని పరిశీలిస్తే, పేద కుటుంబంలో పుట్టి, క్యాంపర్ వ్యాన్ లో నివసిస్తూ, యూరప్ అంతా తిరుగుతూ, ఎక్కడ టెన్నిస్ పోటీలు ఉంటే అక్కడ కనిపిస్తుండే వాడు. జీవనోపాధి కోసం ఇతర ఆటగాళ్ల టెన్నిస్ రాకెట్లను సేకరించి విక్రయిస్తూ ఉండేవాడు. 30 ఏళ్ల వయసున్న బ్రౌన్ తన మూడడుగుల తల వెంట్రుకలతో అందరినీ ఆకర్షిస్తుంటాడు. జర్మనీ, జమైకాలకు చెందిన దంపతులకు పుట్టిన బ్రౌన్ రెండు దేశాల్లోనూ పెరిగాడు. నిన్న జరిగిన రెండో రౌండు పోటీల్లో నాదల్ ను 7-5, 3-6, 6-4, 6-4 తేడాతో ఓడించి హీరో అయిపోయాడు. వింబుల్డన్ సెంటర్ కోర్టులో ఓ అన్ సీడెడ్ ఆటగాడు చూపిన అత్యుత్తమ ప్రదర్శన ఇదేనని మాజీ నంబర్ వన్ జాన్ మెకెన్రో వ్యాఖ్యానించారంటే, అతని ప్రతిభ ఎలాంటిదో తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News