: యాదగిరిగుట్టలో కేసీఆర్ ‘ప్రగతి రథం’... ప్రత్యేక పూజలు చేయించిన అధికారులు


జిల్లాల పర్యటనల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ‘ప్రగతి రథం’ ఆయన వద్దకు చేరింది. నిన్న హైదరాబాదుకు చేరుకున్న ఈ అత్యాధునిక బస్సును యాదగిరిగుట్టకు తీసుకెళ్లిన అధికారులు అక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. దాదాపు రూ.5 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ గానే కాక మైన్ ప్రూఫ్ గాను రూపుదిద్దుకున్న ఈ బస్సు ఎలాంటి దాడుల నుంచైనా కేసీఆర్ ను కాపాడనుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఈ తరహా బస్సుకు ఆర్డరిచ్చినా, కేసీఆర్ బస్సే ముందుగా హైదరాబాదు చేరుకుంది.

  • Loading...

More Telugu News