: లలిత్ మోదీ మనీ లాండరింగ్ కేసులో శ్రీని వాంగ్మూలం రికార్డ్
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ మనీ లాండరింగ్ కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు. "శ్రీనివాసన్ మా ముందు హాజరవడంతో దాదాపు మూడు గంటలపాటు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశాం. అంతకుముందు బీసీసీఐ తరపున ఆయన ఫిర్యాదు దాఖలు చేసిన నేపథ్యంలోనే వాంగ్మూలాన్ని తీసుకున్నాం" అని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. మారిషస్ కు చెందిన ఓ కంపెనీ నుంచి రూ.21 కోట్లు అక్రమంగా మళ్లించారన్న కేసులో భాగంగా లలిత్, మరో ముగ్గురిపై ఫారెన్ ఎక్సేంజ్ వయోలేషన్ కేసు కింద ఈడీ తన దర్యాప్తును విస్తృతం చేసింది.