: బోకోహరాం తాజా దుశ్చర్య... 150 మందిని కాల్చిచంపిన వైనం


పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లింల ఉపవాస దీక్షలు ఓ వైపు... మోటార్ సైకిళ్లపై అత్యాధునిక ఆయుధాలు చేతబట్టిన బోకోహరాం ఉగ్రవాదులు మరోవైపు... నిన్న రాత్రి ఈశాన్య నైజీరియాలోని బోర్నో రాష్ట్రానికి చెందిన మూడు మారుమూల పల్లెల్లో దారుణ మారణకాండ చోటుచేసుకుంది. బోకోహరాం ఉగ్రవాదుల దాడుల్లో 150 మంది దాకా అమాయకులు అసువులుబాశారు. ఉపవాస దీక్షలు ముగించుకుని ఇంటికి వెళ్లబోతున్న ముస్లింలపై బోకోహరాం తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ఇక ఉపవాస దీక్షలు ముగించుకుని ఇంటికి వస్తున్న మగాళ్ల కోసం ఇళ్లల్లో వంటలు చేస్తున్న మహిళలపైనా బోకోహరాం తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. ఇళ్లకు నిప్పు పెట్టి మహిళలను సజీవ దహనం చేశారు. గడచిన మే నెలలో నైజీరియా అధ్యక్షుడిగా మహ్మద్ బుహారీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో జరిగిన అతిపెద్ద నరమేధం ఇదేనట.

  • Loading...

More Telugu News