: ఓటుకు నోటు కేసును మధ్యాహ్నం విచారించనున్న సుప్రీంకోర్టు... సర్వత్రా ఉత్కంఠ
ఓటుకు నోటు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఫస్ట్ సెషన్ లోనే ఈ కేసు విచారణ జరుగుతుందని తొలుత భావించారు. అయితే, కోర్టు సాధారణ కార్యకలాపాల తర్వాత, మధ్యాహ్నం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు పిటిషన్ విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో, రేవంత్ బెయిల్ కొనసాగుతుందా? లేక రద్దవుతుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన జడ్జిలు సుప్రీంకోర్టులో ఉన్నారని... దీంతో, రేవంత్ బెయిల్ రద్దు కావడం చాలా కష్టమని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది.