: హేమమాలినికి కనుబొమ్మల వద్ద కుట్లు వేసిన వైద్యులు... ఆమె డ్రైవర్ అరెస్ట్
బీజేపీ ఎంపీ, సినీ నటి హేమమాలిని గత రాత్రి మధుర నుంచి జైపూర్ కు వెళుతుండగా దౌసా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హేమమాలిని తీవ్రంగా గాయపడగా, ఓ బాలిక దుర్మరణం పాలైంది. చిన్నారి కుటుంబానికే చెందిన మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. హేమమాలిని కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించారు. దీంతో, కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన హేమమాలిని జైపూర్ లో చికిత్స పొందుతున్నారు. ఆమెకు కనుబొమ్మల వద్ద కుట్లు వేశారు. స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.