: జడ్జీలంతా బాబు సన్నిహితులే... రేవంత్ కేసులో తెలంగాణకు అన్యాయం: అదనపు ఏజీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు
ఓటుకు నోటు కేసులో తెలంగాణకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ బెయిలు రద్దు కావడం చాలా కష్టమని, అయితే, తమ వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉండే జడ్జీలు సుప్రీంకోర్టులో ఉండటమే ఇందుకు కారణమని అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులోనే 70 శాతం మంది జడ్జీలు చంద్రబాబుకు అనుకూలమైన వారు ఉన్నారని, అందువల్లే అక్కడ న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను అధిగమించేందుకే తమకు ప్రత్యేక కోర్టు కావాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి చంద్రబాబు పక్కన నాలుగు గంటలు కూర్చోవడం ఎంత వరకూ సబబని అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తిపైనా రామచంద్రరావు విమర్శలు గుప్పించడం గమనార్హం.