: ఏం సాధించాడని ఈ ఊరేగింపు?: బాల్క సుమన్


బెయిల్ పై విడుదలైన సందర్భంగా టీడీపీ నేత రేవంత్ రెడ్డి భారీ ఊరేగింపుతో తరలిరావడాన్ని టీఆర్ఎస్ యువ ఎంపీ బాల్క సుమన్ తప్పుబట్టారు. తెలంగాణ సాధించాడా?... స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడా?... ఏం సాధించాడని భారీ ఊరేగింపు? అని ప్రశ్నించారు. రేవంత్ పక్కా ఆధారాలతో పట్టుబడిన దొంగల ముఠా సభ్యుడని, బెయిల్ పై విడుదలై సిగ్గులేకుండా ఊరేగింపు జరుపుకున్నాడని విమర్శించారు. విడుదలైన తర్వాత రేవంత్ మాట్లాడినదంతా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్టు మేరకేనని సుమన్ ఎద్దేవా చేశారు. ఇక, సీఎం కేసీఆర్ భాషను విమర్శించే మేధావులు రేవంత్ భాష పట్ల ఎందుకు అభ్యంతరం చెప్పరని నిలదీశారు. చంద్రబాబు విసిరే హెరిటేజ్ బిస్కెట్లు తింటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని రేవంత్ పై మండిపడ్డారు.

  • Loading...

More Telugu News