: చార్మినార్ వద్ద ఆటోవాలాకు షాకిచ్చిన అమెరికా అమ్మాయి
హైదరాబాదులో ఆటోవాలాలు చాలా దురుసుగా, అమర్యాదకరంగా వ్యవహరిస్తూ రఫ్ గా డ్రైవింగ్ చేస్తారని ప్రయాణికులు ఆరోపిస్తూ ఉంటారు. అలాంటి ఆటోవాలాను షాకయ్యేలా ఓ అమెరికా యువతి చేసింది. అమెరికా, వాషింగ్టన్ లోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న క్రిస్టీన్ ఫేర్ భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాదులోని చార్మినార్ ను సందర్శించాలని భావించింది. ఇందుకో ఆటోను పిలిచి బేరం కుదుర్చుకునే క్రమంలో మీటర్ వేయమంది. మీటర్ వేయడానికి ఆటోవాలా నిరాకరించాడు. అతనితో వాగ్వాదం ఇష్టం లేని క్రిస్టీన్ ఆటో ఎక్కింది. ఆటో ఎక్కిన అనంతరం ఆటోవాలాతో హిందీలో మాటలు కలిపింది. ఆటోలో మీటర్ వేయడం ఎంత అవసరమో అతనికి అర్థమయ్యేలా హిందీలో ఓ పాట పాడింది. దీంతో బిత్తరపోయిన ఆటో డ్రైవర్ మెల్లిగా మీటర్ వేశాడు.