: ఎవరైనా సరే కేసు నుంచి బయటపడిన తర్వాతే ర్యాలీలు, ప్రసంగాలు చేయాలి: వీహెచ్


నిన్న జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తర్వాత టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద ప్రసంగాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తప్పుబట్టారు. షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చే నిందితులు ర్యాలీలు, ప్రసంగాలు చేయకుండా చట్టాలు చేయాలని అన్నారు. కేసుల నుంచి నిర్దోషిగా బయటపడిన తర్వాతే ర్యాలీలు, ప్రసంగాలు చేయాలని చెప్పారు. మరో సీనియర్ నేత డీఎస్ టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతుండటంపై స్పందించిన వీహెచ్... డీఎస్ పార్టీని వీడినంత మాత్రాన కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం ఉండదని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం అదిరేలా ఉంటుందని... ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరని చెప్పారు.

  • Loading...

More Telugu News