: కేకే, బొత్స, డీఎస్ ల ఫొటోల తొలగింపు
మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో, పార్టీని వీడిన మాజీ పీసీసీ అధ్యక్షుల ఫొటోలను పీసీసీ కార్యాలయం నుంచి తొలగించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో, టీఆర్ఎస్ లోకి జంప్ అయిన కె.కేశవరావు, డి.శ్రీనివాస్, వైకాపా తీర్థం పుచ్చుకున్న బొత్స సత్యనారాయణల ఫొటోలను తొలగించనున్నారు. పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారి ఫొటోలను పీసీసీ కార్యాలయంలో ఉంచడం మొదట్నుంచి వస్తున్న సాంప్రదాయమే.