: కాసేపట్లో కేసీఆర్ మీడియా సమావేశం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా, కేసీఆర్ కీలకమైన అంశాలపై మాట్లాడనున్నారు. ముఖ్యంగా, నిన్నటి ర్యాలీలో తనపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ విరుచుకుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులతో కేసీఆర్ భేటీ కొనసాగుతోంది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరిలో ఏసీబీ డీజీ ఏకే ఖాన్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, హైదరాబాద్ పరిధిలోని పలువురు డీసీపీలు ఉన్నారు. మరోవైపు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News