: ఎప్పుడూ తప్పు చేయలేదు: రైనా


రోజుకొకరిపై ఆరోపణలు చేయడం ద్వారా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ భారత్ లో సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో ఫిక్సింగ్ కు పాల్పడ్డారంటూ లలిత్ మోదీ పేర్కొనడంతో క్రికెట్ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అయితే, అవినీతి చోటుచేసుకోలేదని బీసీసీఐ, ఐసీసీ స్పష్టం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, తనపై మోదీ చేసిన ఆరోపణల పట్ల రైనా స్పందించాడు. ఎప్పుడూ తప్పు చేయలేదని, తనపై ఆరోపణలు చేసిన లలిత్ మోదీపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయమై ఆలోచిస్తున్నానని తెలిపాడు. సరైన స్ఫూర్తితోనే క్రికెట్ ఆడానని, ఈ విషయాన్ని ఫ్యాన్స్ గుర్తించాలని కోరాడు. ఇప్పటివరకు ఎలాంటి అనైతిక చర్యల్లో పాలుపంచుకోలేదని స్పష్టం చేశాడు. ఏ జట్టుకు ఆడినా, క్రికెటే సర్వస్వంగా భావించానని చెప్పాడు.

  • Loading...

More Telugu News