: గ్రీస్ ఎఫెక్ట్... తగ్గిన బంగారం, వెండి, ముడి చమురు ధరలు
గ్రీస్ లో నెలకొన్న సంక్షోభం బులియన్, క్రూడాయిల్ మార్కెట్ ట్రేడర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఆభరణాల తయారీదారులు, స్టాకిస్టులు అమ్మకాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో గురువారం నాటి సెషన్లో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర సాయంత్రం 4 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 191 తగ్గి రూ. 26,220 (ముంబై)కి తగ్గింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 55 తగ్గి రూ. 35,324 వద్ద కొనసాగుతోంది. ఇక ముడిచమురు ధర బ్యారల్ కు రూ. 3,640 వద్దకు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ. 10 తక్కువ. తదుపరి సెషన్లలో సైతం బంగారం, వెండి ధరలతో పాటు క్రూడాయిల్ ధర ఒత్తిడికి గురి కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.