: ఆ 120 మందిని ఏం చేశారు?: భారత్ కు పాక్ ప్రశ్న


120 మంది ఖైదీలను ఏం చేశారంటూ పాకిస్థాన్ భారత్ ను ప్రశ్నిస్తోంది. భారత్ జైళ్లలో ఉన్న పాక్ ఖైదీలు, పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీల వివరాలు ప్రతి ఆరు నెలలకోసారి రెండు దేశాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి. ఇది 2008లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా జరుగుతున్న తంతు. ఈ నేపథ్యంలో పాక్, భారత్ రెండూ ఖైదీల జాబితాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. అయితే భారత్ తన జాబితాలో 27 మంది జాలర్లు సహా 278 మంది మాత్రమే ఉన్నట్టు పేర్కొందని పాక్ ఆరోపిస్తోంది. కానీ తమ రికార్డుల ప్రకారం భారత జైళ్లలో 398 మంది ఖైదీలు ఉన్నారని చెబుతోంది. మిగిలిన 120ని ఏం చేశారని పాక్ హోం మంత్రిత్వ శాఖ ప్రశ్నిస్తోంది.

  • Loading...

More Telugu News