: త్వరలో విడుదల... 'లలిత్ గేట్' సమర్పించు, సుధాంశు మిట్టల్!
గత కొద్ది కాలంగా పలువురు ప్రముఖులతో తనకున్న బంధాలను, వ్యాపార భాగస్వామ్యాలను ట్విట్టర్ ఖాతా ద్వారా బయటపెడుతున్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ, తాజాగా బీజేపీ నాయకుడు సుధాంశు మిట్టల్ బాగోతాన్ని వెల్లడిస్తానని ట్వీట్ చేశారు. ఏమీ లేని స్థాయి నుంచి కోటీశ్వరుడిగా సుధాంశు ఎలా ఎదిగారో త్వరలోనే 'లలిత్ గేట్' ద్వారా తెలియజేస్తానని అన్నారు. ఒకప్పుడు టెంట్ వాలా అయిన సుధాంశు స్టోరీ వచ్చే వారం చెబుతానని ట్వీట్ చేశారు. హవాలా ఆపరేటర్ వివేక్ నాగ్ పాల్ తో మిట్టల్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. 'బ్రేకింగ్ న్యూస్' అంటూ, మరో రెండు ట్వీట్లూ విసిరారు. ఆయన ఇంకా ఎవరెవరి పేర్లు బయట పెడతారోనన్న ఆసక్తి నెలకొంది.