: మోదీ పిలుపుకు సచిన్ స్పందన
ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన 'బేటీ బచావ్... బేటీ పఢావ్' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా ప్రతి తండ్రి తన కుమార్తెతో తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్లో పోస్టు చేయాలని మోదీ సూచించారు. ఆయన పిలుపునందుకుని దేశవ్యాప్తంగా చాలా మంది తమ కుమార్తెలతో సెల్ఫీలు తీసుకుని వాటిని ట్విట్టర్లో పోస్టు చేశారు. తాజాగా, భారత క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ కూడా ప్రధాని మోదీ పిలుపుకు స్పందించారు. తన కుమార్తె సారాతో తీసుకున్న సెల్ఫీని సచిన్ ట్విట్టర్లో పెట్టి 'బేటీ బచావ్...' కార్యక్రమానికి తనవంతు మద్దతు పలికారు.