: స్మితా సబర్వాల్ కథనంపై విచారం వ్యక్తం చేసిన 'ఔట్ లుక్'


తెలంగాణ సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ పై ప్రచురించిన కథనం, అసభ్య క్యారికేచర్ పై 'ఔట్ లుక్' పత్రిక స్పందించింది. తాము సర్వసాధారణంగానే తమ పత్రికలో కొన్ని సెటైర్లు రాస్తామని, అయితే అందులో ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. ఇలాంటివాటిని తేలికగా తీసుకోవాలని తెలిపింది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినట్లయితే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. 'ద బోరింగ్ బాబు' అనే కథనంలో తాము ఎవరి పేర్లను కూడా పేర్కొనలేదని చెప్పింది. అయినా తమకు తెలంగాణ ప్రభుత్వంలోని ఓ అధికారి లీగల్ నోటీసు పంపించారంటూ కొన్ని వార్తాపత్రికలు, టీవీ చానెళ్లు, వెబ్ సైట్లు చెబుతున్నాయని ఔట్ లుక్ తెలిపింది. మీడియా గందరగోళం మొదలై 36 గంటలు గడిచినా తమకు మాత్రం ఏ విధమైన నోటీసు రాలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కూడా తమ పత్రిక హైదరాబాద్ ప్రతినిధిపై వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని, ఆమెపై దాడి చేస్తామని బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్పింది. ప్రస్తుత సున్నితమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ కథనం మొత్తాన్ని తమ వెబ్ సైట్ నుంచి తొలిగించామని వివరించింది. గత 20 ఏళ్లుగా మానవ హక్కులు, మహిళల హక్కులు, మైనారిటీ హక్కులు, వాక్ స్వాతంత్ర్యాలను కాపాడుతూ వచ్చామని, ఈ విషయం తమ పాఠకులందరికీ తెలుసునని ఔట్ లుక్ వివరించింది.

  • Loading...

More Telugu News