: మరో 30 ఏళ్లు సీఎం కేసీఆరేనని ఒప్పుకున్న రేవంత్: టీ-మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై 30 సంవత్సరాలు పోరాడతానని తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి అనడాన్ని ప్రస్తావిస్తూ, అంతకాలం పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ వ్యవహారం పాలమూరు జిల్లాను అప్రతిష్టపాలు జేసిందని విమర్శించారు. ఆయనకు కేవలం బెయిలు మాత్రమే వచ్చిందని, అంతమాత్రాన నిర్దోషిగా బయటపడినట్టు కాదని అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ తో పాటు మరింత మందికి శిక్ష పడటం ఖాయమని జోస్యం చెప్పారు.