: రతన్ టాటా సెకెండ్ ఇన్నింగ్స్...‘జంగిల్ వెంచర్స్’కు ప్రత్యేక సలహాదారుగా కొత్త అవతారం


టాటా సన్స్ ఆనరరీ చైర్మన్, భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేశారు. టాటా సన్స్ బాధ్యతలను సైరస్ మిస్త్రీకి అప్పగించి, ఆనరరీ చైర్మన్ గా తన బాధ్యతలను తగ్గించేసుకున్న రతన్ టాటా, తాజాగా స్టార్టప్ కంపెనీల్లో వరుస పెట్టుబడులు పెడుతూ పారిశ్రామిక రంగాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే నాలుగైదు స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టిన రతన్ టాటా, తాజాగా స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులే లక్ష్యంగా తెరంగేట్రం చేసిన ‘జంగిల్ వెంచర్స్’కు ప్రత్యేక సలహాదారుగా పనిచేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు రతన్ టాటా కొత్త పదవీ బాధ్యతలపై జంగిల్ వెంచర్స్ అధికారికంగా ప్రకటించింది. అనురాగ్ శ్రీవాస్తవ, అమిత్ ఆనంద్ లు నెలకొల్పిన జంగిల్ వెంచర్స్ సింగపూర్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో 30 దాకా స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులను అందించింది. ఈ కంపెనీ బోర్డులో రతన్ టాటా ప్రత్యేక సలహాదారుగా కొనసాగనున్నారు.

  • Loading...

More Telugu News