: యూత్ కు బంపరాఫర్... నీతీ ఆయోగ్ లో చేరితే పేస్కేలుపై 36 శాతం అధిక వేతనం
ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతీ ఆయోగ్ నైపుణ్యమున్న యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని, 32 సంవత్సరాల కన్నా లోపు వయసున్న యువతనే విధుల్లోకి తీసుకోవాలని భావిస్తోంది. నిర్ణయాలు తీసుకోవడంలో యువత సలహాలు దేశాన్ని త్వరితగతిన అభివృద్ధి దిశగా నడిపిస్తాయని భావిస్తున్న మోదీ సర్కారు నీతీ ఆయోగ్ లో వారిని భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తోంది. గతంలో ప్లానింగ్ కమిషన్ లో పనిచేసిన యంగ్ ప్రొఫెషనల్స్ (వైపీ)కు రూ. 31,500 నుంచి రూ. 51,500 వేతన ప్యాకేజీ ఉండేది. ఈ వేతనంపై నైపుణ్యమున్న యువత బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకు రాకపోవచ్చని భావిస్తున్న కేంద్రం వైపీలకు 27 నుంచి 36 శాతం అధిక వేతనాలు ఆఫర్ చేయనుంది. యువతకు నెలకు రూ. 40 వేల నుంచి రూ. 70 వేల వేతనం, ప్రతియేటా రూ. 5 వేల పెంపును ఆఫర్ చేసింది. గతంలో 40 సంవత్సరాల వరకూ వయసున్న వారిని విధుల్లోకి తీసుకోగా, ఇప్పడు దాన్ని 32కు మార్చింది.