: ఇకపై తెలంగాణ, ఏపీలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటా: నారా లోకేశ్
టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి నెలలో 15 రోజులు తెలంగాణలో, 15 రోజులు ఏపీలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. గుంటూరు కేంద్రంగా కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేస్తామని విజయవాడలో తెలిపారు. ఇక్కడి కార్యకర్తల ఇబ్బందులను ఇక్కణ్నుంచే పరిష్కరిస్తామని అన్నారు. హైదరాబాద్ రావాలంటే కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని, ఆ దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని లోకేశ్ పేర్కొన్నారు.