: విదేశాల్లో ఆస్తులున్నాయా? అయితే, మీ టైం స్టార్టయినట్టే!


మీకు విదేశాల్లో ఆస్తులున్నాయా? బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నారా? వాటి గురించిన వివరాలు భారత ప్రభుత్వానికి తెలియజేయలేదా? అయితే మీ టైం స్టార్టయిపోయింది. నల్లధనాన్ని అరికట్టే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. అంతకన్నా ముందు తుది అవకాశంగా సెప్టెంబర్ 30 వరకూ గడువివ్వాలని నిర్ణయించింది. మరో మూడు నెలల్లోగా విదేశీ ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడించి అందుకు సంబంధించిన పన్నులను చెల్లిస్తే, క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకోవచ్చు. పన్ను చెల్లింపులకు డిసెంబర్ 31 వరకూ గడువిస్తారు. ఆస్తి విలువలో 30 శాతం పన్ను, అంతే మొత్తం జరిమానా కట్టాల్సి వుంటుంది. ఒకవేళ ఈలోగా ఆస్తి వివరాలు చెప్పకుంటే ఏప్రిల్ 1, 2016 నుంచి అమల్లోకి వచ్చే కొత్త చట్టం భరతం పడుతుంది. విదేశీ ఆస్తులను గుర్తించి, వాటిపై 30 శాతం పన్నుతో పాటు 90 శాతం జరిమానా కట్టించడంతో పాటు, క్రిమినల్ కేసు పెట్టి గరిష్ఠంగా 10 సంవత్సరాల శిక్ష వరకూ పడేలా ఈ చట్టం చేస్తుంది. ఈ మేరకు విదేశాల నుంచి వస్తున్న ఆదాయం, అక్కడుండే ఆస్తుల వివరాలు వెంటనే తెలియజేయాలని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News