: జర్నలిజం ఇంత పెడదారి పట్టిందా?: స్మితా సబర్వాల్


కొందరు జర్నలిస్టులు పెడదారి పట్టి రాసే కథనాలు విధి నిర్వహణలో వెనుకంజ వేసేలా చేయలేవని తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యానించారు. 'అవుట్ లుక్' మేగజైన్ తన పేరు ప్రస్తావించకుండా రాసిన ఆర్టికల్ పై ఆమె ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. "అవుట్ లుక్ దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు క్షమాపణలు చెప్పాలి. పత్రిక కథనం మహిళలను అగౌరవ పరచేదిగానే వుంది" అని ఆమె అన్నారు. ఈ కథనానికి తాను చాలా బాధపడ్డానని, తాను చాలా చోట్ల పనిచేశానని, ఎక్కడా ఇటువంటి మాటలు పడలేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు వివరించారు. విపరీత ధోరణితో పెడదారి పట్టిన ఎల్లో జర్నలిజం తన విధులను అడ్డుకోలేదని ఆమె అన్నారు. కాగా, ఈ వివాదంలో అవుట్ లుక్ ప్రతిస్పందన కోరగా, తాము ఆమె పేరును ప్రస్తావించలేదు కదా? అని పత్రిక ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News