: కేంద్ర మంత్రి కోసం ముగ్గురిని దించేసిన ఎయిరిండియా!


కేంద్ర మంత్రి కిరేన్ రిజ్జు, ఆయన సహాయకురాలికి సీట్లివ్వడం కోసం ఓ చిన్నారి సహా ముగ్గురిని కిందకు దించేసి విమర్శలకు గురైంది ఎయిరిండియా. ఈ ఘటన గత నెల 24న జరిగినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కోసం విమానాన్ని గంటకు పైగా నిలిపేశారని సమాచారం. లెహ్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లెహ్ వెళ్లిన రిజ్జూ తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ లో రావాల్సి వుంది. వాతావరణం బాగాలేని కారణంగా జమ్మూకాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తో కలసి విమానంలో వెళ్లేందుకు వచ్చారని తెలుస్తోంది. ఈ ఘటనపై రిజ్జా వాదన మరోలా వుంది. తాము విమానాశ్రయానికి వెళ్లేసరికి విమానం డోర్లు మూసివేశారని, 11:40 గంటలకు బయలుదేరాల్సిన విమానం 10:20కే బయలుదేరడం ఏంటని తాము ప్రశ్నించగా, కాసేపటి అనంతరం మమ్మల్ని విమానంలోకి వెళ్లనిచ్చారని తెలిపారు. ముగ్గురిని కిందకు దించారని వచ్చిన వార్తల గురించి తనకు తెలియదని, అలా జరిగితే అది తప్పేనని అన్నారు. ఎయిరిండియా నిర్వాకంపై అధికారులు విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News