: మరోమారు మీసం మెలేసిన రేవంత్...కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యమని ప్రకటన


టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి మరోమారు మీసం మెలేశారు. ఓటుకు నోటు కేసులో నెల రోజుల క్రితం అరెస్టైన సందర్భంగా మీసం మెలేసిన రేవంత్ రెడ్డి, ఈ కేసులో బెయిల్ లభించి జైలు నుంచి విడుదలైన సందర్భంగానూ నిన్న రాత్రి మరోసారి మీసం తిప్పారు. అరెస్టైన నాడు ఆయనలో కనిపించిన ఆవేశం, జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఏమాత్రం తగ్గలేదు. బెయిల్ పై విడుదలైన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో టీఆర్ఎస్ పైనే కాక ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, కేబినెట్ మంత్రులపై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు. ‘‘కేసీఆర్ ను గద్దె దించుతా. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయాల్లో నుంచి తరిమికొట్టేలా ప్రజలను చైతన్యవంతం చేస్తా. ప్రతి యువకుడిని భుజం తట్టి లేపుతా’’ అంటూ రేవంత్ రెడ్డి ఆవేశంగా ప్రసంగించారు. భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదుగా జూబ్లీహిల్స్ లోని ఇంటికి చేరుకున్న రేవంత్ ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి తన సొంతూరు కొడంగల్ కు బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News